మరో హామీని నెరవేర్చిన సీఎం వైఎస్‌ జగన్‌

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. తాజాగా ‘వెలుగు’ వీవోఏ, మెప్మా, యానిమేటర్లు, సంఘమిత్రాల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,297 మంది వెలుగు వీవోఏలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నుంచి రూ.8 వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు. ఇక పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.