మా అమ్మకు పెళ్ళికొడుకు కావాలి…

కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచన మారుతుందని అంటారు… మారడంలో తప్పు లేదు గాని అది కొత్త పుంతలు తొక్కుతూ ఆశ్చర్యాలకు కూడా గురి చేయడమే ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ భారత్ లో విదేశీ సంస్కృతి పాళ్ళు కాస్త ఎక్కువగా కనపడుతున్నాయి. తాజాగా ఒక పోస్ట్ చేస్తే ఇలాంటి సందేహమే వ్యక్తమవుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో పిల్లలు తల్లి తండ్రులను అర్ధం చేసుకోవడం, తల్లి తండ్రులు పిల్లలను అర్ధం చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.

అంత వరకు బాగానే ఉంది గాని తల్లికి పెళ్లి కొడుకుని వెతకడానికి కూతురు ట్విట్టర్ లో పోస్ట్ చేయడమే జనాలను ఆశ్చర్యపరిచింది. ఆస్తా వర్మ అనే యువతీ తన 50 ఏళ్ళ తల్లి కోసం ట్విట్టర్ లో అమ్మకు 50 ఏళ్ళ అందంగా ఉన్న వరుడు కావాలి. అయితే ఈ పెళ్లి కొన్ని షరతులు వర్తిస్తాయి అని ఆమె పేర్కొంది. అమ్మకు కాబోయే భర్త శాకాహారిగా ఉండాలని, మద్యం సేవించరాదని, బాగా సెటిల్ అయిన వ్యక్తి అయ్యి, మంచివాడై ఉండాలని ఆమె ఆ ట్విట్ లో ఆమె పోస్ట్ చేసింది. దీనితో పలువురు కుమార్తెను అభినందిస్తుంటే మరికొందరు తిట్టి పోస్తున్నారు.