మీ ఆశీస్సులు కావాలి: గల్లా జయదేవ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడి మనవడు గల్లా అశోక్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గల్లా జయదేవ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం నవంబరు 10 ఆదివారం ఉదయం 11.15 గంటలకు ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతుందని తెలిపారు. తన కుమారుడి తొలి చిత్రం ముహూర్తం షాట్ కు అందరూ విచ్చేసి దీవించాలని కోరుకుంటున్నట్టు తన భార్య పద్మావతితో కలిసి గల్లా జయదేవ్ ఆహ్వానం పలికారు.