లతా మంగేష్కర్ కు అశ్వస్థత…!

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబై కాండీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాండీ ఆస్పత్రికి వెళ్లి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 90 ఏళ్ళ లతా 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించిన సంగతి తెలిసిందే.