విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు సురేశ్‌ ఈ రోజు మృతి చెందాడు. ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అతడికి ఉస్మానియాలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. కాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు.అతడి శరీరం 65 శాతం కాలిపోవడంతో ప్రాణాధార అవయవాలు (వైటల్‌ ఆర్గాన్స్‌) దెబ్బతిన్నాయని ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రఫీ తెలిపారు. తొలి రోజు మంచిగా స్పందించిన సురేశ్‌ బుధవారం నాటికి శ్వాస తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నాడని చెప్పారు. తొలి రోజు మేజిస్ట్రేట్‌ ఎదుట నిందితుడు మరణ వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.