సీఎం జగన్‌తో ధర్మేంద్రప్రధాన్‌ భేటీ

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారిద్దరూ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కడప ఉక్కుపరిశ్రమకు ఎన్ఎండీసి నుండి ఖనిజం సరఫరాకు ధర్మేంద్ర అంగీకారం తెలపగా త్వరలోనే ఎన్ఎండీసీ- రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. అదేవిదంగా కాకినాడ, రాజమహేంద్రవరంలో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. అంతకుముందు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమైన ధర్మేంద్ర ప్రధాన్‌.. ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.