హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ గల్లా అశోక్‌

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ తెరకు పరిచయం కానున్నాడు. అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గల్లారామచంద్ర నాయుడి మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ హీరోగా నవంబర్ 10న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ భార్య పద్మావతి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.