హెల్మెట్ నుంచి మినహాయింపు…!

ద్విచక్ర వాహనాలు నడిపే వారికి… హెల్మెట్ అనేది నేటి రోజుల్లో తప్పనిసరిగా మారింది. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గుజరాత్‌ పట్టణాల్లో ద్విచక్ర వాహన చోదకులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్త శుభవార్త చెప్పింది. పురపాలక సంఘాల పరిథిలో వాహనాలను నడిపేటపుడు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి కాదని గుజరాత్ మంత్రి ఆర్ సీ ఫైదు మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మరణాలను నిరోధించేందుకు హెల్మెట్ ధారణ తప్పనిసరి చేశామని చెప్పుకొచ్చిన ఆయన చాలా మంది ప్రజలు దీనితో ఆగ్రహంగా ఫిర్యాదులు చేస్తున్నారని… నగరాలు, పట్టణాల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళేటపుడు కూడా హెల్మెట్లను ధరించాలంటే కష్టంగా ఉంటోందని, కూరగాయల దుకాణానికి వెళ్తే, హెల్మెట్‌ను ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక జరిమానాలను కూడా ప్రభుత్వం భారీగా తగ్గించింది.