10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం

తిరుమలలో శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలంటే కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే సాధ్యమవుతుంది. ఈ సమయంలో స్వామిని వైకుంఠద్వారం నుంచి దర్శించుకోడానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైకుంఠ ద్వారాలను 10 రోజులు పాటు తెరిచి ఉంచాలని టీటీడీ భావిస్తోంది. భక్తుల రద్దీని ద్రుష్టిలో వుంచుకోని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. దీనికి టీటీడీ ఆగమ సలహామండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇంకా పాలకమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యలు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతామన్నారు టీటీడీ అధికారులు.