13 ఏళ్లపాటు సంతానోత్పత్తిని దూరం చేసే ఇంజక్షన్‌

ఒక్క ఇంజక్షన్‌తో 13 ఏళ్లపాటు సంతానోత్పత్తిని దూరం చేసే ఔషధాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ శర్మ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేస్తోంది. దీనికి ‘రివర్సిబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌’ (ఆర్‌ఐఎ్‌సయూజీ) అని పేరుపెట్టారు. పురుషుల వృషణాల నుంచి వీర్యకణాలను మూత్రనాళానికి చేరవేసే నాళికకు మత్తుమందు ఇచ్చి.. ఈ ఇంజెక్షన్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది.

303 మందిపై మూడు విడతలు జరిపిన ప్రయోగ పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని సమాచారం. ఈ ఇంజెక్షన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లభించడానికి మరో ఏడు నెలలు పట్టొచ్చు. ఇది అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజక్షన్‌గానూ ఇది రికార్డులకెక్కుతుంది.