మంచులో చిక్కుకుని భారత సైనికులు మృతి…!

సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుతుండగా దక్షిణ సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే అవలాంచీ రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకొని హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపింది. హిమపాతంలో గస్తీ బృందం చిక్కుకున్న ప్రాంతాన్ని తొలుత గుర్తించిన సహాయక బృందం దట్టమైన మంచులో కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసారు. అప్పటికే ఇద్దరు ఆర్మీ సిబ్బంది కన్నుమూయగా, సురక్షితంగా వెలికి తీసిన తక్కినవారిని హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ బేస్ క్యాంప్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.