30 సెకన్లు మోగాల్సిందే..

ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ సమయం విషయంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి చెక్‌ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్‌ ఫోన్ల విషయంలో ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ టైమ్‌ను 30 సెకన్లుగా నిర్ణయించింది. ల్యాండ్‌లైన్‌ ఫోన్ల విషయంలో ఈ సమయం నిమిషంగా తేల్చారు.  ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయాన్ని తగ్గించడం విషయంలో ఒక కంపెనీపై మరో కంపెనీ ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెలిఫోన్‌ సేవా నిబంధనలను సవరించింది.