73 ఏళ్ళ రికార్డ్ బద్దలు కొట్టాడు..!

ఆసిస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 73 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్ ని బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మహ్మద్‌ ముసా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 7 వేల పరుగులు పూర్తి చేసాడు. 73 ఏళ్ల క్రితం 1946లో ఇంగ్లండ్‌ గ్రేట్‌ వాలీ హమ్మాండ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు సాధించగా స్మిత్‌ 126వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్కుని అందుకుని సరికొత్త రికార్డ్ నమోదు చేసాడు, మూడో స్థానంలో టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల పరుగుల సాధించి నాలుగో స్థానంలో… సచిన్.. విరాట్‌ కోహ్లి, కుమార సంగక్కారా, గ్యారీ సోబర్స్‌ 138 ఇన్నింగ్ లలో 7 వేల పరుగులు చేసాడు.