వినియోగదారులకు టెలికాం కంపెనీల షాక్…

వినియోగదారులకుటెలికాం కంపెనీలు షాకిచ్చాయి. తమ టారిఫ్‌ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ప్రకటించాయి. డిసెంబర్‌1 నుంచి ధరలు పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియాప్రకటించగా.. డిసెంబర్‌ మొదట్లో రేట్లు పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.అయితే ఎంత మొత్తంలో పెంచుతున్నదీ రెండు కంపెనీలూ వెల్లడించలేదు. వినియోగదారులకుప్రపంచస్థాయి డిజిటల్‌ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వొడాఫోన్‌పేర్కొనగా.. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్‌తెలిపింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ రెండుకంపెనీలు భారీ మొత్తంలో నష్టాలు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పెంపు నిర్ణయంవెలువరించింది.