బన్నీకి బాస్ గా పూజా హెగ్డే..?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ . ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోహిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాతో అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏంటి? అనే ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ సినిమాలో ఆమె అల్లు అర్జున్ కి బాస్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఓ కార్పొరేట్ సంస్థలో బన్నీకి తాను బాస్ గా కనిపించనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు దూసుకుపోతున్నాయి.