వాళ్ళు మీ తోడబుట్టిన వాళ్ళా రాహుల్…?

అక్రమ వలసదారులు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తోడబుట్టిన వాళ్ళా అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌పూర్‌లో ప్రసంగించిన ఆయన… ఎన్నార్సి ని ఉద్దేశించి రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేసారు. ఎన్నార్సి ఎందుకు తెస్తున్నారని రాహుల్ ప్రశ్నించారని, అక్రమ వలసదారులను ఎందుకు పంపించేస్తారని, “వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏం తింటారు? అని అడుగుతున్నారు. ఎందుకు సోదరా! మీ తోడబుట్టినవాళ్ళలా కనిపిస్తున్నారా ఏమిటి? ఒక్కొక్క అక్రమ వలసదారుని గుర్తించి, పంపించేసే పనిని బీజేపీ ప్రభుత్వం చేయబోతోంది” అని ఆయన స్పష్టం చేశారు. 2024 నాటికి దేశంలోని అక్రమ చొరబాటుదారులందరినీ దేశం నుంచి పంపించేస్తామని స్పష్టం చేసారు.