జంతువులు కూడా సిగ్గుపడతాయి.. ప్రియాంకరెడ్డి హత్యపై అనుష్క…

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతి పట్ల సినీ నటి అనుష్క సంతాపం తెలిపారు. ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. ప్రియాంకపై జరిగిన దాడి అత్యంత విషాదకరమైన ఘటన అని, ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉందని అనుష్క పేర్కొన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నేరస్థులను జంతువులతో పోల్చినా..జంతువులే సిగ్గుపడతాయి. ఈ సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా..? ఏ పాపం తెలియని ప్రియాంకను చంపిన నిందితులకు తక్షణమే కఠినశిక్ష పడేలా మనమంతా పోరాటం చేయాలని ప్రజలకు అనుష్క సూచించారు.. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..ఆమె కుటుంబసభ్యుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు అనుష్క పోస్ట్ చేసారు.