రేషన్ కార్డుల జారీలో కీలక నిర్ణయం

రేషన్ కార్డులజారీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లోవార్షిక ఆదాయం, ఇత‌ర నిబంధ‌న‌ల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రామాల్లో అయితేవార్షిక ఆదాయం లక్షా 20వేలు, ప‌ట్ట‌ణాల్లో వార్షిక ఆదాయం ల‌క్షా 44 వేల‌ లోపు ఉన్నవారే రేషన్ కార్డుపొందడానికి అర్హులుగా నిర్ణయించింది. ఫోర్ వీలర్స్ ఉన్నవారిని బీపీఎల్ కోటా నుంచిమిహాహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులనుబీపీఎల్ కోటా లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.