వాట్సాప్‌ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి: ఆర్మీ

ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ఇటీవల హ్యాకర్లు తరచుగా దాడులకు దిగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, భారత ఆర్మీ కూడా వాట్సాప్ యూజర్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని పలు సూచనలు చేస్తోంది. భారత భద్రతా బలగాలకు చెందిన 98 వ్యవస్థలకు చెందిన కంప్యూటర్లనే కాకుండా, సాధారణ ప్రజల సోషల్ మీడియా అకౌంట్లపైనా చైనా, పాకిస్థాన్ హ్యాకర్ల కన్నుపడిందని ఆర్మీ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా, భారత జవాన్లు ఉన్న వాట్సాప్ గ్రూపులపై దాడులకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని ఆర్మీ చెబుతోంది. దీంతో వాట్సాప్ గ్రూపుల విషయంలో ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రూపుల్లో అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా గ్రూప్ అడ్మిన్స్ కు సమాచారం అందించాలని సూచించింది. ముఖ్యంగా 86తో ప్రారంభమయ్యే నంబర్లు మరింత ప్రమాదకరమని ఆర్మీ నిఘావర్గాలు హెచ్చరించాయి.