పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం…

అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ ట్రిపుల్ సెంచరీ (335)తో ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. 589/3 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకే ఆలౌట్ అయింది. యాసిర్ షా (113) సెంచరీ చేయగా, బాబర్ ఆజం (97) రాణించారు. ఇక ఆసిస్ విజయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డపై టీం ఇండియా మాత్రమే ఓడించగలదు. ఆ సత్తా భారత జట్టుకు మాత్రమే ఉందని వాన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అతు ట్వీట్ చేసాడు.