ప్రభుత్వం శాశ్వతం కాదు..!

ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు… రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది విధ్వంసకర ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

తమపై తప్పుడు కేసులు పెట్టొద్దని పోలీసులను కోరుతున్నానని, కోడికత్తి కేసు గురించి ఈ ఆరు నెలల్లో జగన్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని చంద్రబాబు నిలదీశారు. అధికారం చేతిలో ఉండి కూడా బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో చెప్పలేకపోతున్నారని, జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు. తమ హాయంలో ఉచితంగా ఇసుకను అందజేశామని గుర్తు చేసారు. వైసీపీ ప్రభుత్వంలో లారీ ఇసుక ధర మూడు రెట్లు పెరిగిందని ఆరోపించారు.