తీవ్ర తుపాన్‌ గా బుల్‌బుల్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్‌ అతి తీవ్ర తుపాన్‌ గా రూప దాల్చంది. తూర్పు బంగాళాఖాతానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం పై తుపాన్‌ కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 350, దక్షిణ సాగరదీవులకు 490 కి.మీల దూరంలో ఉందని… 10 వ తేదిన తెల్లవారుజామున సాగరదీవులును బుల్ బుల్ తుఫాన్ దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక తుపాన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని అధికారులు తెలిపారు. తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన పోర్ట్‌లలో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.