మహేష్ కి బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీ..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అయితే మహేష్ బాబు షూటింగ్, ఫిలిం ఈవెంట్స్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ మరియు బౌన్సర్లను పొందడం సాధారణ విషయమే. అయితే మహేష్ బాబు కు షూటింగ్ సమయంలో బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..మహేష్ బాబు కు బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడమే.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని సీన్స్ ను కాశ్మీర్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో మహేష్ బాబు కు బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇచ్చినట్లు సమాచారం.