ఆన్ లైన్ లో ఇసుక అమ్మకాలు

ఇసుక కష్టాలు రాష్ట్రంలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీ వల్ల ఇసుక దొరకక, పనులు లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో కురిసిన వరదల కారణంగా జలశయాలు నిండడంతో ఇసుక తీయడం కష్టంగా మారిందని ఒక పక్క ప్రభుత్వం చెబుతుంటే… మరోపక్క ఇసుకను సంవృద్ధిగా సప్లై చేస్తామని ఆన్ లైన్ వ్యాపార సమస్థలు చెబుతున్నాయి. అది కూడా కేజీ ప్రకారం విక్రయిస్తున్నట్లు ఆన్ లైన్ సమస్థలు చెబతున్నాయి. ఇండియా మార్ట్ అనే సంస్థ క్యూబిక్ ఫీట్ కు రేటు కట్టి అమ్మకాలు సాగిస్తుంది. కేజీ, ఐదు కేజీలు, 10 కేజీల ప్యాకేట్ల రూపంలో డోర్ డెలివరీ చేస్తామంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు ఇస్తున్నాయి.