దిశ చట్టంపై సంచలన వ్యాఖ్యలు…

దిశ చట్టం  బోగస్‌ అని ఆయేషా తండ్రి ఇక్బాల్‌ బాషా అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలన్నారు ఇక్బాల్.  21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదన్నారు. సక్రమంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకోవచ్చన్నారు. ఆయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్‌ అన్నారు.

ఫ్లాష్ న్యూస్: పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పవర్ ప్లాంట్ వద్ద భారీ మంటలు…

పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పవర్ ప్లాంట్ 48/60 MG, ట్రాన్స్ఫర్ వద్ద అకస్మాత్తుగా మంటలు భారీగా చెలరేగుతున్నాయి అగ్నిమాపక కేంద్రం లేక పోవడం చేత సుమారు ఒక గంట సేపు మంటలు చెలరేగుతున్నాయి పవర్ స్టేషన్ లో ఉన్న ట్రాన్స్ఫర్ 3 గాను ఒకటి పూర్తిగా కారిపోయింది readmore..

పవర్ కోసం పవన్ తొందర: రాజు రవితేజ

మాజీ జనసేన ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు చేసారు. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ లేదన్నారు. పార్టీలో అంతర్గతంగా పారదర్శకత లేదన్నారు. సొంత పార్టీ వాళ్ళను పైకి రాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ వేదికను వ్యక్తిగత అంశాల కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడారని readmore..

అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తి..

అత్యాచారం, హత్యకు గురైన అయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. అయేషామీరా ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది. ఎముకలు, readmore..

అక్రమ సంబంధం..బతికుండగానే కాల్చేశారు!

అక్రమ సంబంధం ఓ వ్యక్తి సజీవ దహనానికి నేపథ్యమైంది. హైదరాబాద్‌  నగరానికి చెందిన వ్యక్తి కర్ణాటకలోని గుల్బర్గా  సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన నాగరాజుకు హేమలతతో పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌  ప్రగతినగర్‌  లోని ఓ స్థిరాస్తి వ్యాపారి వెంకటేశ్వర్‌  రెడ్డి readmore..

ఏపీ ప్రభుత్వానికి అభినందనలు : వెంకయ్యనాయుడు

‘దిశ’ యాక్ట్ ను తీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ‘మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ‘ఏపీ దిశ’ చట్టానికి ఆమోద ముద్ర వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. readmore..

ఇంద్రకీలాద్రి పై భక్తులకు తప్పని ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్ లో చాలా దేవాలయాల్లో కాటేజీలు, వసతి సౌకర్యాలు ఉంటాయి. కానీ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గమ్మ దేవస్థానానికి మాత్రం కాటేజీలు లేవు. ఎంత దూరం నుంచి భక్తులు వచ్చినా దర్శనం చేసుకుని వెళ్ళిపోవటం తప్ప వేరే మార్గం లేదు. రాష్ట్రంలో రెండవ దేవాలయం అయి readmore..

రోజా ఎందుకు స్పందించటం లేదు : ఆయేషా మీరా తల్లి

12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం జరుగుతుంది. దీనిపై ఆయేషా తల్లి షంషాద్‌ బేగం స్పందించారు. సీబీఐ ద్వారా తన బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని బేగం తెలిపారు. అయేషామీరాకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం readmore..

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్..

అమలాపురం మాజీ ఎంపీ, దళిత నాయకులు హర్షకుమార్‌ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ సిబ్బందిని దూషించిన కేసులో హర్షకుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి.. 353, 323, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. డాక్టర్ల చేత పరీక్షలు చేయించిన అనంతరం హర్షకుమార్‌ని రాజమహేంద్రవరం 7వ readmore..

సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించిన ప్రభుత్వం

పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 24 నుంచి జనవరి 1 వరకు ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. పాఠశాల readmore..