యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా తరలిరావడంతో  ఆలయ పరిసరాల్లో సందడిగా నెలకొంది. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చిన  భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని  దర్శించుకుని తరిస్తున్నారు. కార్తీక దీపారాధన, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో  readmore..

తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల ఆలయం ఈ రోజు తెరుచుకుంది. ఈ రోజు నుంచి డిసెంబర్ 7 వరకు స్వామివారికి నిత్యపూజలు జరగనున్నాయి. ఆలయం తెరుచుకోవడంతో పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆలయం తెరుచుకున్న తొలిరోజునే మహిళలు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. దీంతో readmore..

తిరుమల లడ్డూలో వెంట్రుకలు..!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు, దారాలు దర్శనం ఇచ్చాయి. హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన ఓ భక్తుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డుప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. స్వామి readmore..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు… శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 10 గంటల సమయం, టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60వేల 618మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.42 readmore..

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలన్ని కిటకిటలాడుతున్నాయి. శివుడికి ప్రత్యేకంగా భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. భీమవరం, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలంలోని శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

ఘనంగా శ్రీవారి తెప్పోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంటేశ్వర స్వామి ఆలయంలో క్షిరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై పుష్కరిణిలో రూపంలో అలంకరించిన తెప్ప పై విహరించారు. స్వామివారి పుష్కరిణిని ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలో శోభాయమానంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లకి readmore..

శ్రీవారి భక్తులకు టీటీడి షాక్…

శ్రీవారి భక్తులకు టీటీడి షాక్ ఇచ్చింది. తిరుమలలో అద్దెగదుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నందకం అద్దె గదులను 600 నుంచి వేయి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కౌస్తుభం, పాంచజన్యం లో 500 నుంచి వేయి రూపాయలకు పెంచగా పెంచిన ధరలను నేటి నుంచి అమలులోకి వస్తాయని readmore..

శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రం

కార్తీకమాసం మొదటి సోమవారం శ్రీగిరి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో రద్దీ కనిపించింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కృష్ణవేణికి వాయనాలు సమర్పించారు. కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఆలయం ముందు గంగాధర readmore..

టీటీడీ నుండి డాలర్ శేషాద్రి ఔట్..! మరో వంద మందికీ ఉద్వాసన: తితిదే కీలక నిర్ణయం..!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేస్తున్న దాదాపు వంద మందిపై వేటు పడనుంది. అందులో శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రి కూడా ఉన్నట్లు విశ్వస నీయ సమాచారం. అయితే, తన పైన వేటు పడకుండా ఆయన తన వంతు readmore..