జిల్లాల పర్యటనకు గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 9,10,11 తేదీల్లో యాదాద్రి భువనగిరి, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో గవర్నర్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా గవర్నర్ 9న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం వరంగల్ చేరుకొని ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకును సందర్శించనున్నారు. readmore..

డయల్ 100 పై అవగాహన పెంచేందుకు..

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డయల్ 100 పై అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో సైతం ఈ విషయాన్ని ముద్రించనున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో, ప్రమాదాల బారి నుండి రక్షించుకోవడానికి 100 కు కాల్ చేయాలనే ఆలోచనను కలిగేలా విద్యార్థులకి readmore..

మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆంగ్లో ఇండియన్స్‌ స్థానంలో థర్డ్‌ జెండర్స్‌కు రిజర్వేషన్లు కల్పించాలని, చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్‌కు తక్షణమే రిజర్వేషన్స్ తొలగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆంగ్లో ఇండియన్స్‌ కోటాను థర్డ్‌ జెండర్స్‌కు దక్కేలా సవరణ చేయాలని readmore..

తెలంగాణలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు

తెలంగాణ : వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి మిస్సింగ్‌పై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. యువతి చిన్నాన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు readmore..

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి ఆత్మహత్య చేసుతుంది. భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భార్య నిహారిక… తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రమాదంలో readmore..

ఆస్తి తగాదాలు : తమ్ముడి హత్య

హైదరాబాద్ : అంబర్ పేట్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా సొంత తమ్ముడైన రమేష్(40) ను అన్నా, వదినలు కలిసి హతమార్చారు. అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం.. మృత దేహాన్ని పోస్ట్ readmore..

నాగర్‌కర్నూల్‌ లో దారుణం..!

నాగర్‌కర్నూల్‌ లోని కొల్లాపూర్‌ టీచర్స్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నిహారిక, కుమారుడు కేదార్‌నాథ్‌(16 నెలలు), కుమార్తె మణిదీప్తి(3)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ readmore..

ఆ ఎంపీలు, ఎమ్యెల్యేలను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయలేదు?

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై మహిళా సంఘం అధ్యక్షురాలు దేవి స్పందించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని… పోలీసులు ప్లాన్‌ ప్రకారమే నిందితుల్ని చంపేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్కౌంటర్ లు దీనికి సమాధానం కాదని, చట్టపరమైన మార్పులు చేసి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేసారు. readmore..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో పిటిషన్‌

షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్‌ దాఖలైంది. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలవురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని readmore..

హైదరాబాద్ చేరుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం

దిశ హంతకుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం హైదరాబాద్ చేరుకుంది. మరికాసేపట్లో ఈ బృందం షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళ్లనుంది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించనుంది. కాసేపట్లో శంషాబాద్ నుంచి readmore..