కోడిగుడ్ల కోసం మంత్రి అనుచరులు కొట్టుకున్నారు…

అభివృద్ధి చేయడం చేతకాని వారు తనను విమర్శిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసారు. కర్నూలు జిల్లాలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేసారు. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిపై విమర్శలు చేసారు. మంత్రి బుగ్గనకు ఆర్థికశాఖ ఫండమెంటల్స్‌ తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడిగుడ్ల కోసం బుగ్గన అనుచరులు కొట్టుకున్నారని ఎద్దేవా చేసారు. దోమలపై దండయాత్రను బుగ్గన హేళన చేశారన్నారు. ప్రాజెక్టులు ఆగిపోయాయి, పెట్టుబడులు వెనక్కిపోయాయి..అన్న క్యాంటీన్లను మూసివేసి పేదవాడి పొట్ట కొట్టారని ఆరోపించారు. 4,5 విడతల రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? అని చంద్రబాబు నిలదీశారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తామని అప్పుడే చెప్పానన్నారు.