గొనె సంచిలో బాలిక మృతదేహం

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా మువ్వ ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు తిరిగి రాకపోవడంతో కళాశాలలో స్వీపర్ గా పని చేస్తున్న చిన్నారి తల్లి… పాప కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీనితో పాప తల్లి తండ్రులు ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ని పరిశీలించినా ఆధారాలు ఎక్కడా లభించలేదు. దీనితో చుట్టూ ఉన్న ఇళ్లల్లో వెతకగా బాలిక మృతదేహం పక్కన ఇంట్లో బీరువాలో ఉంది.

బాలిక మీద అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ప్రకాష్ అనే వ్యక్తి మూట గట్టి బీరువాలోని పెట్టాడు. ఇంటి ముందు ఆడుకుంటూ నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి ద్వారక మువ్వ ఉదంతం విషాదంగా ముగిసింది. పక్కింట్లోనే చిన్నారి మృతదేహం ఓ గోనె సంచిలో లభ్యమైంది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాష్‌ అనే వ్యక్తి … ద్వారకపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. వెళ్లి తిరిగి రాలేదు. భర్త ప్రవర్తన తేడాగా ఉండటాన్ని గమనించిన ప్రకాష్‌ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రకాష్‌ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.