వివాహ వేడుకలో చిన్నారి హత్య!

చిత్తూరు జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఫంక్షన్ హాల్ లో బంధువుల వివాహా వేడుకకు హాజరైన వర్షిణీ అనే చిన్నారి… అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాత్రి 12 గంటల వరకు బంధువుల మధ్య ఆనందంగా గడిపిన వర్షిణి… ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. తెల్లవారుజామున ఫంక్షన్ హాల్ పక్కనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిన్నారిని హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.