సేన తో వద్దు…

అవసరమైతే ఎన్నికలకు వెళ్దాము లేదా బయట నుంచి మద్దతు ఇద్దాం అంటూ మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి నుంచి మరాఠా ప్రజలు వస్తారని భావించినా.. కాంగ్రెస్ వెనకడుగు వేయడంతో ఇది తేలే అవకాశం కనపడటం లేదు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ప్రభుత్వంలోకి వద్దని సూచిస్తున్నారు. గతాన్ని మర్చిపోవద్దు అంటూ అధిష్టానానికి చురకలు అంటిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు జరిగినా అది కలహాల కాపురమే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోనియా తొందరపడవద్దు, నేతలు అధికారానికి కక్కుర్తి పడవద్దని సీనియర్ నేతల అసహనం వ్యక్తం చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.