కొత్త జంట..క్రికెట్ చూస్తూ…

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఉండే ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా మంది దానిని జీవితంగా భావిస్తూ ఉంటారు. కొంత మంది అయితే ఎంత బిజీ గా ఉన్నా సరే మ్యాచ్ చూస్తూ వినోదం పొందుతూ ఉంటారు. తాజాగా విడుదలైన ఒక ఫోటో చూస్తే క్రికెట్ అభిమానులకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో అర్ధమవుతుంది. అప్పుడే పెళ్లి చేసుకున్న ఓ జంట టీవీలో క్రికెట్‌ చూస్తూ కూర్చిండిపోయిన ఫోటో ఒకటి అంతర్జాతీయ క్రికెట్ మండలి పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన పెళ్లి కొడుకు (హసన్ తస్లీం). పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేసరికి టీవీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌ వస్తుందని మిగిలిన కార్యక్రమాలను పక్కనపెట్టి టీవీలో మ్యాచ్‌ను చూసుకుంటూ కూర్చిండిపోయామని అతను వివరించాడు.