రికార్డులు బద్దలు కొడుతున్న ‘మున్నా బద్మామ్ హువా’ ఐటమ్ సాంగ్

బాలీవుడ్ ఖండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రెజెంట్ దబాంగ్ సిరీస్ లో మూడో భాగం ఈ నెల 20న క్రిస్మస్ కానుకగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో సల్మాన్ తో పాటు మమతా శర్మ కనిపిస్తోంది. ‘మున్నా బద్మామ్ హువా’ అంటూ సాగే పాటను విడుదల చేసి కొద్ది సమయం కాకుండానే… ఇప్పటికే దాదాపు కోటి వ్యూస్ సాధించి, టాప్ లోకి వెళ్లిపోయింది.