దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్..!

పాకిస్థాన్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. చాన్నాళ్ళ తర్వాత తన అభిమానులకు అసలు సిసలు ఆట రుచి చూపించాడు. 418 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 39 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 335 పరుగులు చేశాడు.

ఇక వార్నర్ గురించి ఐసిసి ఒక ట్వీట్ చేసింది. 23 జూలై 2015న ఓ అభిమాని వార్నర్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగాడు. ట్రిపుల్ సెంచరీ చేస్తే చూడాలని ఉందని తన కోరికను బయటపెట్టగా… వార్నర్ నా సహనాన్ని పరీక్షించాలనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఐసిసి ‘‘నీకు చాలా ఓపిక ఉంది’’ అని ట్వీట్ చేసింది.