
దేశ రాజధాని నగరం చుట్టూ 100 కోట్లతో 11 వేల వైఫై హాట్ స్పాట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వీటిలో 100వైఫై హాట్ స్పాట్ జోన్లను ఈ నెల 16నప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 11 వేల ఉచిత వైఫైజోన్లలో బస్ స్టాపుల్లో 4 వేలు, మార్కెట్లు, ఇతర ప్రముఖప్రాంతాల్లో 7 వేలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలి 100 హాట్ స్పాట్లను 16వ తేదీన ప్రారంభించి, ప్రతి వారం 500 వైఫై హాట్ స్పాట్లు పెంచుకుంటూఆరు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సిటీ వ్యాప్తంగా హాట్ స్పాట్ జోన్ల నుంచి ఢిల్లీవాసులు ఒక్కొక్కరు 15 జీబీ ఉచిత డాటా చొప్పున పొందుతారని తెలిపారు. 2015 ఎన్నికల మేనిఫెస్టోలోభాగంగా ఢిల్లీవ్యాప్తంగా ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. ప్లాన్ ఆమోదం విషయంలో గణనీయంగా జాప్యం చోటుకున్నప్పటికీఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు వచ్చింది..