రాజీనామా చేసిన సీఎం…

మహారాష్ట్రం ముఖ్యమంత్రి పదవికి దేవేందర్ ఫడ్నవీస్ రాజీనామా చేసారు. ప్రభుత్వ ఏర్పాటు పై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ అర్ధరాత్రి తో అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపధ్యంలో ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బిజెపి, శివసేన వెనక్కి తగ్గని సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించి జాగ్రత్త పడుతున్నాయి. అననతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామన్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు బిజెపికే ఉందన్న ఆయన తమ పని తీరుకి బహుమానంగా ఎక్కువ సీట్లు ఇచ్చారన్నారు. రైతుల కోసం అభివృద్ధి కోసం పని చేశామన్నారు.