నేను కాదు ఆయనే..: గడ్కరి

ఒకపక్క ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎటు తేల్చుకోక ముందే బిజెపి నేతలు అధికారంలోకి వస్తామని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివసేన ముఖ్యమంత్రి పదవి విషయంలో భీష్మించుకుని కూర్చోవడంతో బిజెపి పెద్దలు దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు నితిన్ గడ్కరి చేపడతారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన ఆయన వార్తలను కొట్టిపారేశారు. “నేను దిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నాను. మహారాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తాననే ప్రశ్నే లేదు. ఎన్నికల్లో మాకు 105 సీట్లు వచ్చాయి. శివసేన మద్దతుతో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి దేవేంద్ర ఫడణవీస్‌ నాయకత్వం వహిస్తారని కుండ బద్దలు కొట్టారు.