తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా  ఉంది. శ్రీవారి దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 69వేల 670మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.27 కోట్ల రూపాయలు.