దేశభక్తి చట్టాన్ని ప్రయోగించిన తొలి అధ్యక్షుడిగా ‘ట్రంప్‌’

అమెరికా మొదటి సారిగా దేశభక్తి చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. అమెరికాపై ఒసామా బిన్‌ లాడెన్‌ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001లో  అమెరికా పార్లమెంట్‌ ఈ చట్టాన్ని ఆమోదించింది. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్‌ అమీన్‌ హసౌన్ అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్‌ కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. అదమ్ పుట్టిన లెబనాన్‌ గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించాయి.దీంతో జాతీయ భద్రతా దృష్ట్యా అమీన్ ను విడుదల చేయకుండా జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు అమెరికా దేశభక్తి చట్టాన్ని ప్రయోగించింది.