పాఠశాల ఆటోను ఢీ కొట్టిన కారు…

కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లి గ్రామం శివాజీ విగ్రహం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్… ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఆటో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ను ఫారెస్ట్ కార్యాలయంలోని సెక్షన్ ఆఫీసర్  వెంకట స్వామిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.