పదవీ విరమణ పథకానికి అనూహ్య స్పందన

ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు BSNL,MTNL చేపట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి అనూహ్య స్పందన లభించింది.మోత్తం 92 వేల మంది వీఆర్ఎస్ కు  దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వవర్గాలుతెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ స్థాయిలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు రావడం ఇదేమొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ రెండు సంస్థల్లో వీఆర్‌ఎస్‌కుదరఖాస్తు గడువు డిసెంబర్‌ 3తో ముగియనుంది. BSNL లో మొత్తం లక్షన్నర మంది ఉద్యోగులు వుండగా సుమారులక్ష మంది వీఆర్‌ఎస్‌కు అర్హులున్నారు. 70 నుంచి80 వేల మంది ఈ పథకాన్ని ఎంచుకుంటేకంపెనీకి జీతాల రూపంలో నెలకు ఏడు వేల కోట్ల రూపాయల వరకు భారం తగ్గనుంది.