18 ఏళ్ళు నిండిన వాళ్ళు కండోమ్‌లను పట్టుకెళ్లండి..!

దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మానవ మృగాలను శిక్షించాలని వారికి శిక్ష పడాలని డిమాండ్లు వినపడుతున్నాయి. ఈ గొడవ ఈ స్థాయిలో జరుగుతుంటే ఒక సిని నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. డేనియల్‌ శ్రావణ్‌ అనే చిత్ర నిర్మాత 18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డాడు. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదన్నాడు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవన్నాడు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్‌లను ఉపయోగించాలని అనడమే కాకుండా… ఇదోక సాధారణ విషయమని వ్యాఖ్యానించాడు. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడని అభిప్రాయపడ్డాడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలని ఒక సలహా కూడా ఇచ్చాడు.