బీజేపీలో జనసేనను విలీనం చేస్తామంటే మాకు ఓకే: జీవీఎల్

బీజేపీలో జనసేనను పవన్ విలీనం చేస్తానంటే స్వాగతిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎన్నికల ముందు జనసేనను విలీనం చేయాలని కోరామని.. అప్పుడు పవన్ అందుకు అంగీకరించలేదని జీవీఎల్ అన్నారు. అయితే పొత్తులకు ఇది సమయం కాదని… రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి వేరే వారిపై ఆరగుడుల బుల్లెట్ సంధించాలంటే పొరపాటే అవుతుందని జీవీఎల్ సూచించారు.

మరోవైపు దేశంలో మతసామరస్యాలకు హిందువులు, హిందూ నాయకులే కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలనుజీవీఎల్ ఖండించారు. మత ఘర్షణలకు హిందువులే కారణమన్న పవన్ మాటల వెనుక రాజకీయదురుద్దేశం ఉందని జీవీఎల్ అన్నారు. పవన్ కళ్యాణ్ తనవ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.