
హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతినిప్రశ్నించిన క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారమేరాయుడిపై చర్యలు తీసుకుంటామని హెచ్సీఏ సభ్యులు అంటున్నారు. హెచ్సీఏలో అవినీతిపైఅంబటి రాయుడు మంత్రి కేటీఆర్కు ఈ మధ్య కాలంలోనే ట్విటర్లో విజ్ఞప్తి చేశారు.దయచేసి అవినీతిని అంతం చేయాలని కోరారు. ఏసీబీ కేసులున్న పాలకులు ఆటగాళ్ల ఎంపికపైప్రభావం చూపిస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు.ఈ ట్వీట్ పై స్పందించిన హెచ్సీఏ నూతన అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అంబటిరాయుడు ఓ ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు.