సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం… 18 మంది భారతీయులు మృతి

సూడాన్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు భారతీయులు మృతి చెందారు. ఖార్తూమ్ పారిశ్రామికవాడలోని పింగాణి పరిశ్రమలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.

మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ రాయబార కార్యాలయం తెలిపింది. మరో ఏడుగురు భారతీయులకు గాయాలయ్యాయని, నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిపింది.