నిందితులకు ఉరిశిక్ష వేయాలి..

వైద్యురాలి హత్య ఘటనపై షాద్‌నగర్ అట్టుడికిపోతోంది. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రజా సంఘాల నాయకులూ ఆందోళనకు దిగారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ స్టేషన్ గేట్ వద్దకు దూసుకెళ్లిన ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోగా రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.