సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఇద్దరి లోకం ఒకటే’

యంగ్ అండ్ యనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, దిల్ రాజు నిర్మించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. క్యూట్ బ్యూటీ శాలినీ పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రెండు పాటలను విడుదల చేశారు.