వరుణుడు అడ్డుపడతాడా..?

భారత్‌, బంగ్లా రెండో టీ20కి తుపాను ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగేఅవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 7న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మ్యాచ్‌ జరగాల్సిఉంది. ఇప్పటికే తొలి పోరులో ఓటమి పాలైన టీమిండియా రెండోదైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలోఅరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఒమన్‌ వైపు పయనిస్తోంది. ఏ క్షణంలోనైనాఅది దిశను మార్చుకొనే అవకాశం ఉంది.