మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే..?

పూజా హెగ్డే… టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వస్తున్నాయంటే మొదట వినిపించే పేరు. స్తుతం సీనియర్ హీరోయిన్స్ స్థానాలకు ఎసరెట్టిన ఈ ముద్దగుమ్మకు ఎవరు పెద్దగా పోటీ ఇవ్వడం లేదు. డేట్స్ అందుబాటులో ఉంటే స్టార్ హీరోల సినిమాలకు దాదాపు ఆమెనే ఫిక్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా హౌస్ ఫుల్ 4 తో పూజా హెగ్డే సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా హిట్ కొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. త్వరలో f2 సినిమాను బోణికపూర్ తో బాలీవుడ్ లో రీమేక్ కానుంది. అయితే ఈ సినిమాలో హాని పాత్రలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తుంది. డీజే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. మరి బాలీవుడ్ లో ఈ అమ్మడు ఎంత వరకు క్లిక్ అవుతుందో వేచి చూడాలి.