భారత్ పై దాడులు చేయాలని ఐఎస్ఐ కీలక ఆదేశాలు

భారత్ లో భారీగా ఉగ్రవాదులను పంపాలని హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చెయ్యాలని… పోలీసులు, సర్పంచులపై దాడులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా సంస్థ కార్యాకలాపాలను పెంచుకోవచ్చని ఉగ్రవాదులకు సూచించింది. ఈ మేరకు కీలక సమాచారం భారత్ నిఘా వర్గాలకు ఇప్పటికే అందినట్టు సమాచారం. లష్కరే తోయిబా కమాండర్ అష్ఫాక్ బర్వాల్ , యూసుఫ్ ఖ్వారీ, జైషే మహ్మద్ ఉగ్రవాది రహమాన్ ఖాన్ తదితరులతో జరిగిన రహస్య సమావేశంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక ఏయే గ్రామాల మీద దాడులు చెయ్యాలి… ఎవరి మీద దాడులకు పాల్పడాలి అనేది ఒక జాబితాను సిద్ధం చెయ్యాలని ఉగ్రవాదులను ఆదేశించింది. కాగా జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ భారత్ లో దాడులకు ఉగ్రవాదులను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే.